ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా పోస్టు కేసులో.. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్కు సుప్రీం కోర్టు బెయిల్

ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా పోస్టు కేసులో.. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్కు సుప్రీం కోర్టు బెయిల్

ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో.. అశోక యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ మహ్ముదాబాద్‌ కు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.  ఈ కేసు దర్యాప్తుపై స్టే విధించాలన్న  పిటిషన్ తిరస్కరించింది. 

ఆపరేషన్‌ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంతో  ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్ముదాబాద్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  హరియాణాలోని అశోక యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ మీడియాకు వివరించడాన్ని మీడియా ఆర్భాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బీజేపీ యూత్ వింగ్ ఫిర్యాదు మేరకు ఆయనను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

హ‌ర్యానా రాష్ట్ర మ‌హిళా క‌మీష‌న్ కూడా ఆ ప్రొఫెస‌ర్‌కు నోటీసులు ఇచ్చింది.  ఢిల్లీ పోలీసుల అరెస్టును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ పిటిషన్‌ చారణ జరిపిన సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

చీఫ్ పాపులారిటీ కోసం ఇలాంటి పోస్టులు పెట్టవద్దని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ.. దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని స్పందిచాలని కోర్టు సూచించింది. కొన్ని  వర్గాలను రెచ్చగొట్టేలా.. ఇతరుల గౌరవానికి భంగం వాటిల్లేలా మాట్లాడటం తగదని సూచించింది. 

అదే విధంగా ఈ కేసులో 24 గంటల్లో ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని హర్యాణా డీజీపీని ఆదేశించింది. సిట్ దర్యాప్తుకు సహకరించాలని ప్రొఫెసర్ అలీ ఖాన్ కు సూచించింది.