ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జీవిత ఖైదు శిక్ష రద్దు: బాంబే హైకోర్టు బెంచ్

 ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జీవిత ఖైదు శిక్ష రద్దు: బాంబే హైకోర్టు బెంచ్

 

  • ఆయనకు నక్సలిస్టులతో సంబంధాలు లేవు

  • తీర్పునిచ్చిన బాంబే హైకోర్టు బెంచ్

  • అతనితో పాటు ఐదుగురిపై ఉపా కేసు కొట్టివేత


నాగ్ పూర్ : ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్ధోషిగా ప్రకటించింది. ఆయనతో పాటు ప్రశాంత్ రాహి, మహేశ్ తిక్రి, హేమ్ కేశ్వదత్త మిశ్రా, విజయ్ నాన్ తిక్రి, పాండు నరోట్ లపై ఉపా కేసును కొట్టివేసింది. సాయిబాబాకు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ.. ఆయనకు నక్సలిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొంది. వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనెజెస్ లతో కూడిన హైకోర్టు బెంచ్ ఈ మేరకు ఇవాళ తీర్పునిచ్చింది. 2024 అక్టోబర్ 14న సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్థోషిగా ప్రకటించి వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. నిందితుల విడుదలపై స్టే విధించింది. ఈ కేసుపై మరోసారి వాదనలు వినాలని  దీంతో మరోసారి వాదనలు విన్న బాంబే హైకోర్టు బెంచ్ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 

ALSO READ :- కేసులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం: ఎమ్మెల్సీ క‌విత

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో మాహారాష్ట్ర పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 2017 మార్చి 7న గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబా అప్పీల్ కు వెళ్లారు. కాగా చిన్నప్పటి నుంచి 90% వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా వీల్ చైర్ కే పరిమితమయ్యారు. ప్రస్తుతం నాగ్ పూర్ సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. ఆయనను విడుదల  చేయాలని కొంతకాలంగా  పౌర సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శిక్ష రద్దయిన ఈ ఐదుగురిలో పాండు నరోట్ చనిపోయారు.