కుటుంబ పాలన అంతం కావాలి : ప్రొఫెసర్ కోదండరాం

కుటుంబ పాలన అంతం కావాలి : ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు : సకల జనులంతా కలిసి ప్రత్యేక తెలంగాణ సాధించి కేసీఆర్ చేతిలో పెడితే.. ఆయన కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్టూడెంట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు అరిగోస పడ్డారన్నారు. అన్ని వర్గాలకు సమ న్యాయం జరగాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలన్నారు.

సోమవారం ముషీరాబాద్ లోని నాగమయ్యకుంటలో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తరఫున కోదండరాం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాన్ని ఓటర్లకు వివరించారు. అనంతరం అంజన్ కుమార్ మాట్లాడుతూ.. స్కామ్ లకు, లీకేజీలకు బీఆర్ఎస్ కేంద్రంగా నిలిచిందని ఆరోపించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.