ధరణిపై కేసీఆర్ విష ప్రచారం: కోదండరామ్

ధరణిపై కేసీఆర్ విష ప్రచారం: కోదండరామ్

ధరణి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మండిపడ్డారు.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లీగల్ ఎంపవర్మెంట్, అసిస్టెంట్ ఫర్ ఫార్మర్ సొసైటీ లీఫ్ ఆధ్వర్యంలో భూమి ఎజెండా, తెలంగాణ ఎన్నికలు,  ప్రజల ఆకాంక్షలు అంశం నిర్వహించిన చర్చ వేదికలో భూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్, సుప్రీమ్ కోర్టు సీనియర్ అడ్వేకేట్ నీరుప్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరితో పాటు పలువురు విద్యా వేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ధరణి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని... దాన్ని  తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. పరిష్కారం లేని సమస్యల్లో పడేసి.. రైతు ఆత్మహత్యలకు కారణం అయిన ముఖ్యమంత్రికి తగిన బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్.. ప్రతీది తన చేతుల్లో పెట్టుకోవడం కారణంగానే.. ఎవరి పని వాళ్ళు చేయకపోవడంతో సమస్యలు పెరిగిపోయాయన్నారు.

 అడ్డగోలుగా భూ సేకరణ జరుగుతోందని.. ధరణిని సవరించి మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చే దిశగా పోరాటం చేస్తామని కోదండరామ్ చెప్పారు. రైతుకు భూమి మీద హక్కు , రక్షణ ఉండాలన్నారు. రెవెన్యూ విధానాన్ని సాధించుకోవడానికి మా ప్రయత్నం ఉంటుందని తెలిపారు. ధరణి బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని అయన చెప్పారు..

అనంతరం సీనియర్ న్యాయవాధి నీరూప్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఫస్ట్ అంటారు... కానీ, తెలంగాణ లో లాస్ట్ ఉందన్నారు. ప్రజల దగ్గర ఉన్న భూ సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు వాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఒక భూ జీఓ తీస్తే.. రెవెన్యూ మంత్రి ఎవరో  తెలిసేదని అన్నారు. అప్పటి ప్రభుత్వాల్లో రెవెన్యూ కోర్టు, రెవెన్యూ బోర్డు, రెవెన్యూ చట్టాలు ఉండేవని.. ఇప్పుడు అవి లేవని తెలిపారు.  దున్నే వాడిదే భూమి అన్నారని... ఇప్పుడు తెలంగాణలో ఆ మాట ఎక్కడ పోయిందని నీరూప్ రెడ్డి అన్నారు.