మెరుగ్గా పీఎఫ్‌ సేవలు.. లాభపడనున్న వర్కర్లు, కంపెనీలు

మెరుగ్గా పీఎఫ్‌ సేవలు.. లాభపడనున్న వర్కర్లు, కంపెనీలు

2020లో మరిన్ని డిజిటల్‌ సేవలు

న్యూఢిల్లీ: ఎంప్లాయిస్‌‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌‌ (ఈపీఎఫ్‌‌ఓ) సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్‌‌ఓ 2020లో అనేక చర్యలను తీసుకోనుంది. పేపర్‌ లెస్‌‌ ఆర్గనైజేషన్‌‌గా మారేందుకు కొత్త ఏడాది మరిన్ని డిజిటల్‌ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఉద్యోగుల(సబ్‌ స్క్రయిబర్లు) కోసం యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌‌)ను, కంపెనీల(ఎంప్లాయర్‌) కోసం ఈ–ఇన్‌‌స్పెక్షన్‌‌ సౌకర్యాలను తీసుకొచ్చింది. 2020లో ఈపీఎఫ్‌‌ఓ రెండు కార్యక్రమాలపై దృష్టి సారించిందని సెంట్రల్ ప్రొవిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ సునీల్‌ బర్త్‌‌వాల్‌ అన్నారు. ఒకటి వర్కర్ల ఈజ్‌ ఆఫ్‌‌ లివింగ్‌‌ను మెరుగుపరచడం కాగా, రెండవది కంపెనీల ఈజ్‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ను మరింత సరళీకరించడమని తెలిపారు. ఈపీఎఫ్‌‌ఓ, అర్హత కలిగిన వర్కర్లకు యూఏఎన్‌‌ సౌకర్యాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో ఏ వర్కర్‌ కూడా సోషల్‌ సెక్యూరిటీ బెనిఫిట్స్‌‌కు దూరం కాబోరని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కంపెనీలు కూడా ఫిజికల్‌‌గా డాక్యుమెంట్లను సబ్మిట్‌ చేయడం, ఇన్‌‌స్పెక్టర్‌‌ను కలవడం వంటివి తగ్గించడానికి ఈ–ఇన్‌‌స్పె క్షన్‌‌ సిస్టమ్‌‌ను ప్రారంభించిందన్నారు. ఈ–ఇన్‌‌స్పెక్షన్‌‌ ఫారాలు ఆన్‌లైన్‌లో కంపెనీకి అందుబాటులో ఉంటుం దన్నారు.

పెన్షనర్ల కోసం కొత్త సేవలు..
పెన్షనర్ల ఈజ్‌ ఆఫ్‌‌ లివిం గ్‌ ను మెరుగుపరిచేందుకు, ఈపీఎస్‌‌ పెన్షనర్స్ పీపీఓ(పెన్షన్‌‌ పేమెంట్‌ ఆర్డర్‌) ను డిజిలాకర్‌ వెబ్‌ సైట్‌ /యాప్‌‌లో అందుబాటులో తీసుకొచ్చింది. దీంతో పెన్షనర్లు ఫిజికల్‌ పీపీఓను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌ ఫోన్‌‌ లేదా వెబ్‌
సైట్‌ ద్వారా డిజిటల్‌ పీపీఓను చూపిస్తే సరిపోతుంది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌‌ ట్రస్టీ, 2018–19లో ఈపీఎఫ్ మెంబర్ల ఆకౌంట్‌‌లోని నగదుపై 8.65 శాతం వడ్డీ చెల్లించడానికి ఆమోదం తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2019–20లో ఎంత వడ్డీ చెల్లించాలనేదానిపై ఈపీఎఫ్‌‌ఓ ఇప్పటికి కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఎప్రీల్‌ 1, 2019 కి ముందే అమలులోకి రావాలి. దీంతో పాటు ఈపీఎఫ్‌‌ఓ, ట్రస్టీ ఎంప్లాయిస్‌‌ పెన్షన్స్‌ స్కీమ్‌‌(ఈపీఎస్‌‌) 1995ను సవరించింది. 15 ఏళ్ల కమ్యు టేషన్‌‌ను విత్‌ డ్రా చేసుకున్న పెన్షనర్ల కమ్యుటెడ్‌ వాల్యును తిరిగి పునరుద్ధరించింది. ఈ సవరణతో 6.3 లక్షల మంది పెన్షనర్లు లాభపడనున్నారు. కంపెనీలు, సబ్‌ స్క్రయిబర్ల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌‌ఓ, ఈపీఎఫ్ఐజీఎంఎస్‌‌ 2.0 పోర్టల్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో 5
కోట్ల మంది సబ్‌ స్క్రయిబర్లు, వేల కంపెనీలు లాభపడతాయి.

నిఫ్టీ, సెన్సెక్స్‌‌ ఈటీఎఫ్‌ పై ఆసక్తి..
నిఫ్టీ, సెన్సెక్స్‌ ఈటీఎఫ్‌‌లో 50:50 రేషియోలో ఇన్వెస్ట్​ చేయడానికి ఆమోదం తెలిపింది. ఫండ్‌ మేనేజర్లుగా యూటీఐ ఏఎంసీ, ఎస్‌‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌‌ను నియమించింది. ఈ సంస్థలు అక్టోబర్‌ 1, 2019 నుంచి మూడేళ్ల పాటు ఈ సంస్థకు ఫండ్‌ మేనేజర్లుగా ఉంటాయి. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌ బాండ్లపై ఇన్వె స్ట్‌‌చేసిన రూ. 700 కోట్లను వసూలు చేసేందుకు, వివిధ చర్యలను ఆమోదించింది. నాన్‌‌ డెరివేటివ్‌ మార్కెట్‌‌లో పాల్గొనేందుకు లీగల్‌ ఎంటిటీ ఐడెం టిఫికేషన్‌‌(ఎల్‌ ఈఐ)ను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. ప్రెవేట్‌ కంపెనీ బాండ్‌‌లలో ఇన్వెస్ట్‌‌ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్‌‌ చేయాలంటే ఆ కంపెనీల బాండ్లకు క్రిసిల్‌, కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్‌లో కచ్చితంగా రెండు రేటింగ్‌‌లు ఉండాలి.