
యజమానులు ఇంట్లో లేనప్పుడు పెంపుడు జంతువులను చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు పెట్ని డెన్ నుంచి బయటికి వదలడం కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు స్మార్ట్‌డోర్ ఉపయోగపడుతుంది. పెట్ హోంకి ఈ డోర్‌ని బిగించాలి. దీన్ని పెట్‌సేఫ్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. దీనికి ప్రోగ్రామబుల్ సెలక్టివ్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది.
ఎగ్జిట్ ఆటో లాకింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే.. కుక్క డెన్లోకి వెళ్లగానే డోర్ లాక్ అవుతుంది. దీనికి వాటర్‌ప్రూఫ్ స్మార్ట్కీ కూడా ఉంటుంది. డోర్‌తోపాటు ఐదు స్మార్ట్కీలు వస్తాయి. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. ఇన్‌స్టలేషన్ కూడా చాలా ఈజీ. ధర: 13,000 రూపాయలు