
మాలావత్ పూర్ణ, నాసా సైంటిస్ట్ కావ్య మన్యపు మరో రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఎవరూ ఎక్కని లడక్ లోని 6 వేల అడుగులకు పైగా ఎత్తున్న పర్వతాన్ని ఎక్కారు. 100 మంది పేద బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడం కోసం ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరుతో పర్వతారోహణ మొదలుపెట్టారు. రూ.80 లక్షల దాకా నిధుల సేకరణే లక్ష్యంగా ఈ సాహసయాత్ర చేశారు. సోమవారం ఢిల్లీకి చేరుకున్న ఈ బృందం మీడియాతో మాట్లాడింది. ఇకపై తాము చేపట్టే ప్రతి పర్వతారోహణ ద్వారా రూ.80 లక్షలు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నామని, వాటిని పేద బాలికల విద్యకు వినియోగిస్తామని చెప్పింది.