
మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇండియాలో ప్రముఖ SUV మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ స్కార్పియో N,థార్ Roxx, XUV700. XUV3XO వంటి అత్యధికంగా సేల్ అయిన బ్రాండెడ్ మోడల్స్ అందించింది. అంతేకాదు గతేడాది BE6, XEV9e వంటి మోడల్స్ ఉత్పత్తి చేయడం ద్వారా ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ లో కూడా అడుగు పెట్టింది. వచ్చే ఏడాది తన మరిన్ని మోడల్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. రాబోయే మహీంద్రా కంపెనీ ఐదు కొత్త మోడల్ కార్లను గుర్తించి తెలుసుకుందాం.
2030 నాటికి భారతదేశంలో 7 కొత్త ICE SUVలు ,5 EVలను పరిచయం చేయనున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. అందులో 3 ICE SUVలు ,2 EVలు వచ్చే ఏడాది అంటే 2026లో విడుదల కానున్నాయి. ICE ఉత్పత్తులలో 2 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్, 2మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్ ఉంటాయని ఈ కార్ల తయారీదారు సంస్థ ధృవీకరించింది. కొత్త-తరం మోడల్ వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ అది కొత్త-మోడల్ బొలెరో లేదా హ్యుందాయ్ క్రెటా ప్రత్యర్థి కావచ్చునని అంచనా వేసింది.
ప్రస్తుత మార్కెట్లో ఉన్న మహీంద్రా మోడల్స్..
- మహీంద్రా XUV 3XO మోడల్ రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.56 లక్షలు
- మహీంద్రా బొలెరో మోడల్ ధర రూ. 9.79 లక్షల నుండి రూ. 10.91 లక్షలు
- మహీంద్రా XUV400 మోడల్ ధర రూ. 15.49 లక్షల నుండి రూ. 17.49 లక్షలు
- మహీంద్రా బొలెరో నియో,నియో ప్లస్ మోడల్ ధర రూ. 9.95 లక్షల నుండి రూ. 14.04 లక్షలు
- మహీంద్రా థార్ మోడల్ ధర రూ. 11.50 లక్షల నుంచి రూ. 17.40 లక్షలు
- మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మోడల్ ధర రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.50 లక్షలు
- మహీంద్రా స్కార్పియో ఎన్ మోడల్ ధర. రూ. 13.99 లక్షల నుంచి రూ. 24.89 లక్షలు
- మహీంద్రా థార్ రాక్స్ మోడల్ ధర రూ. 12.99 లక్షల నుంచి రూ. 23.09 లక్షలు
- మహీంద్రా XUV700 మోడల్ ధర రూ. 14.49 లక్షల నుంచి రూ. 25.14 లక్షలు
- మహీంద్రా బిఇ 6 మోడల్ ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షలు
- మహీంద్రా XEV 9e మోడల్ ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షలు