సీఏఏకు అప్లై చేయాలంటే మతపరమైన ఆధారాలుండాలి

సీఏఏకు అప్లై చేయాలంటే మతపరమైన ఆధారాలుండాలి

వివాదాస్పద సిటిజన్ షిప్ సవరణచట్టం (సీఏఏ) కింద మనదేశ పౌరసత్వం పొందాలనుకునే వారికి కేంద్రం సోమవారం క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే ముస్లింలు కాని రిఫ్యూజీలు తప్పనిసరిగా మతపరమైన ఆధారాలు చూపించాలని చెప్పా రు. తాము ఏమతానికి చెందిన వాళ్లమో రుజువుచేసే పత్రాలతో పాటు…డిసెంబరు 31, 2014 నాటికి మనదేశానికి వచ్చినట్టు నిరూపించే డాక్యు మెంట్లను కూడా చూపించాలని అధికారులు చెప్పారు. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు మనదేశ పౌరసత్వంకల్పించాలని కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. సీఏఏ కింద కొత్త రూల్స్​ను ఇష్యూ చేస్తామని అధికారులు చెప్పారు.