నాన్‌వెజ్ కాకుండా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలనుకుంన్నారా? అయితే ఈ రెసిపీలు మీకోసమే. ప్రొటీన్ పుష్కలంగా ఉండే మీల్ మేకర్స్ (సోయా చంక్స్)తో ఈజీగా, టేస్టీగా ఎన్నో వంటలు తయారుచేసుకోవచ్చు. సాయంత్రం ఆకలి తీర్చే శ్నాక్‌గా, వర్కవుట్ తర్వాత ఎనర్జీ ఫుడ్‌గా లేదా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఆస్వాదించేందుకు సరిపోయే మూడు సింపుల్ సోయా రెసిపీలు మీకోసం. మరింకేం.. వెంటనే ఈ రెసిపీలు టేస్ట్ చేయండి.
క్రిస్పీ శ్నాక్
కావాల్సినవి :
మీల్ మేకర్స్ – ఒక కప్పు
శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్
నూనె – రెండు టీస్పూన్లు
పసుపు – పావు టీస్పూన్
కారం – అర టీస్పూన్
గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, నీళ్లు – సరిపడా
తయారీ :
వేడి నీళ్లలో మీల్ మేకర్స్ వేసి కాసేపయ్యాక వడకట్టి పక్కన పెట్టాలి. చల్లారాక అందులోని ఎక్స్‌ట్రా నీటిని పూర్తిగా పిండేయాలి. తర్వాత ఆ మీల్ మేకర్స్‌ను మధ్యలోకి కట్ చేసి రెండు ముక్కలుగా చేయాలి. దీనివల్ల మసాలాలు లోపలి వరకు బాగా పడతాయి. కట్ చేసిన సోయా ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. చివరగా కొద్దిగా నూనె వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. మసాలా కలిపిన మీల్ మేకర్స్‌ను ఒవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. అంతే, ఇవి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
జ్యూసీ సోయా
కావాల్సినవి :
మీల్ మేకర్స్ – ఒక కప్పు
ఓట్స్ పిండి – ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి, నూనె లేదా వెన్న – ఒక్కో టీ స్పూన్
నిమ్మరసం, కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు, మిరియాల పొడి – సరిపడా
పసుపు – పావు టీస్పూన్
కారం – అర టీస్పూన్
తయారీ :
వేడి నీళ్లలో మీల్ మేకర్స్ వేసి పది నిమిషాలు ఉంచాలి. అవి మెత్తబడ్డాక, చల్లటి నీటితో కడిగి అందులోని నీటిని పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఓట్స్ పిండి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. పాన్‌లో నూనె లేదా వెన్న వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఆ తర్వాత మీల్ మేకర్స్‌ని పాన్‌లో వేసి, తక్కువ మంటపై వేగించాలి. ఆపై ఓట్స్ పిండి వేసి నీళ్లు పోసి కలపాలి. చివరిగా మిరియాల పొడి వేసి, నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి బాగా కలపాలి. ఈ రెసిపీని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.
