పెట్రో, నిత్య్యావసర ధరల పెంపును నిరసిస్తూ..

పెట్రో, నిత్య్యావసర ధరల పెంపును నిరసిస్తూ..
  • కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

కేంద్రం పెట్రోల్‌‌‌‌, డీజిల్, గ్యాస్‌‌, నిత్యావసరాల ధరలను ఇష్టంవచ్చినట్లు పెంచి సామాన్యుల బతుకులను ఆగం జేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. పలుచోట్ల వాహనాలకు తాడు కట్టి లాగుతూ, ఖాళీ సిలిండర్లను చూపిస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ 75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరలు తగ్గించకపోగా అన్ని వస్తువులపై జీఎస్టీ విధించడం దారుణమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌, బస్‌‌‌‌ చార్జీలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్లు వంశీకృష్ణ, పటేల్ ప్రభాకర్ రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ వినోద్ కుమార్, నేతలు సంజీవ్ ముదిరాజ్,  బెక్కరి అనిత,  చంద్రకుమార్ గౌడ్, అర్థం రవి,  నయీమోద్దీన్,  పీజే బెనహర్,  శ్రీహరి, రాజు  తదితరులు పాల్గొన్నారు. –- నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు.