నా అవినీతిని నిరూపించండి.. రాజీనామా చేస్తా : మేడ్చల్ చైర్ పర్సన్

నా అవినీతిని నిరూపించండి.. రాజీనామా చేస్తా : మేడ్చల్ చైర్ పర్సన్

వార్డులలో అభివృద్ధి పనులు చేయకుండా.. కౌన్సిలర్లు అవినీతికి పాల్పడుతున్నారని మేడ్చల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి ఆరోపించారు.  తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిధ్ధమని ప్రకటించారు. ప్రతివార్డులో అభివృద్ధి పనులు చేయడానికి.. కౌన్సిలర్లు అందరికి  సహకరిస్తున్నానని తెలిపారు. ప్రజలు ఎన్నుకుంటేనే చైర్ పర్సన్ పదవి చేపట్టానని, వార్డుల అభివృద్ధే తన ధ్యేయమని తెలిపారు.

చైర్ పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ మేడ్చల్ మున్సిపాలిటీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి 16 మంది కౌన్సిలర్లు వినతి పత్రాన్ని అందజేసి మంగళవారం ధర్నా చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ చైర్ పర్సన్ దీపికా నర్సింహారెడ్డి స్పందించారు. ఈ విషయంపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ధర్నా చేసిన కౌన్సిలర్లందరు తమ వార్డులలో  అభివృద్ధి పనులను పక్కకు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.