రూ.51 వేల మార్క్ క్రాస్ చేసిన బంగారం

రూ.51 వేల మార్క్ క్రాస్ చేసిన బంగారం

పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం బాటలోనే వెండి ధరలు రోజు రోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. భారత్ లో బంగారం ధర 51 వేల మార్క్ ను మళ్లీ క్రాస్ చేసి ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. భవిష్యత్‌లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా పెరుగుతోంది. ఆదివారం తులం బంగారంపై రూ. వేయి మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. కాగా.. కిలో వెండిపై రూ.400 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 63,000 గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 గా ఉంది.
 

మరిన్ని వార్తల కోసం

ఓఎన్​జీసీకి రూ.8,764 కోట్ల లాభం

డేటా సెంటర్లకు పెరిగిన డిమాండ్