PSLV C47 కౌంట్​డౌన్​ షురూ

PSLV C47 కౌంట్​డౌన్​ షురూ

చంద్రయాన్​2 ప్రయోగం తర్వాత ఇస్రో చేస్తున్న కార్టోశాట్​ 3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే శ్రీహరికోటలోని సతీశ్​ ధావన్​ స్పేస్​సెంటర్​ రెండో ప్రయోగ వేదికపై పీఎస్​ఎల్​వీ సీ47 రాకెట్​ను నిలబెట్టిన ఇస్రో, మంగళవారం ఉదయం 7.28 గంటలకు 26 గంటల కౌంట్​డౌన్​ను స్టార్ట్​ చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలకు కార్టోశాట్​3 ప్రయోగం జరగనుంది. మంగళవారం సాయంత్రం రాకెట్​ నాలుగో దశ ఇంజన్​లో ఇంధనాన్ని నింపారు ఇస్రో సైంటిస్టులు. ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్​ కె. శివన్​, తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్టోశాట్​3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 చిన్న ఉపగ్రహాలనూ పీఎస్​ఎల్​వీ సీ47 నింగిలోకి మోసుకెళ్లనుంది. కార్టోశాట్​3ని పోలార్​ సన్​ సింక్రనస్​ ఆర్బిట్​లోకి పంపుతారు.

మిషన్ వివరాలు

ప్రధాన పేలోడ్​                 కార్టోశాట్​3

కక్ష్య ఎత్తు                      509 కిలోమీటర్లు

లాంచ్​ప్యాడ్​                    రెండో ప్రయోగ వేదిక

ప్రయోగ కోణం                 140 డిగ్రీలు

మైల్స్టోన్స్

74– శ్రీహరికోట నుంచి చేపడుతున్న మిషన్​

49– పీఎస్​ఎల్​వీ ప్రయోగం

21– పీఎస్​ఎల్​వీ ఎక్స్​ఎల్​  వేరియంట్​ ప్రయోగం

9– కార్టోశాట్​ సిరీస్​లో పంపుతున్న ఉపగ్రహం సంఖ్య

5– ఈ ఏడాది చేస్తున్న ప్రయోగం సంఖ్య

కార్టోశాట్3 ప్రత్యేకతలు

భూమిని అణువణువూ జల్లెడ పట్టే మూడో తరం ఉపగ్రహం. అత్యంత ఎక్కువ రిజల్యూషన్​తో ఈ ఉపగ్రహం భూమి ఫొటోలు తీస్తుంది.బరువు 1625 కిలోలు .కరెంట్​ జనరేషన్​- 2 వేల వాట్లు

మిషన్​ లైఫ్​- ఐదేళ్లు

ప్రత్యేకించి మిలటరీ అవసరాల కోసం దీన్ని ప్రయోగిస్తున్నారు. దాంతో పాటు అర్బన్​ ప్లానింగ్​, గ్రామీణ ప్రాంతాల వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీర ప్రాంత భూముల వాడకం వంటి వాటి కోసమూ సేవలు అందిస్తుంది.

అంతర్జాతీయ పేలోడ్లు

ఇస్రో కమర్షియల్​ వింగ్​ అయిన న్యూ ఇండియా స్పేస్​ లిమిటెడ్​ (ఎన్​ఎస్​ఐఎల్​) ద్వారా అమెరికాకు చెందిన 13 పేలోడ్లను ప్రయోగిస్తున్నారు.

ఫ్లాక్​4పీ- మొత్తం 12 ఉపగ్రహాలు. భూమి పరిశీలన కోసం పంపుతున్న శాటిలైట్

మెష్​బెడ్​- కమ్యూనికేషన్​ కోసం పంపుతున్న టెస్ట్​బెడ్​ శాటిలైట్