మాజీ ఇంటెలిజెన్స్​ చీప్​ పీఎస్సార్​ ఆంజనేయులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ ఇంటెలిజెన్స్​ చీప్​ పీఎస్సార్​ ఆంజనేయులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న ఆయనను  హుటాహుటిన జీజీహెచ్​ కు  తరలించారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్లో ఉన్నారు. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారిగా గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్​  బేగంపేటలోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం (ఏప్రిల్‌ 22)ఆయనను అదుపులోకి తీసుకొని అనంతరం విజయవాడ తరలించారు.  గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు  ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు. 

►ALSO READ | కడప ఎమ్మెల్యే మాధవి పీఏ ఘరానా మోసం..

 జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుని విచారించనున్నారు. నటి జెత్వానీ తప్పుడు ఆరోపణలపై అరెస్టు, వేధింపులకు పాల్పడినందుకు సస్పెండ్ చేయబడిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరు. మరోవైపు ఇదే కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీ కూడా నిందితులుగా ఉన్నారు.