పిల్లలను బంధించిన నేరస్తుణ్ణి స్పాట్‌లోనే కాల్చేసిన పోలీసులు

పిల్లలను బంధించిన నేరస్తుణ్ణి స్పాట్‌లోనే కాల్చేసిన పోలీసులు

కూతురు బర్త్‌డేకు పిలిచి పిల్లలను ఇంట్లో బంధించిన నేరస్తుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఫరూకాబాద్‌ జిల్లా కఠారియా గ్రామానికి చెందిన సుభాష్ బాథమ్‌ మర్డర్ కేసులో బెయిలుపై విడుదలయ్యాడు. సుభాష్ గురువారం తన కూతురు పుట్టినరోజు ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్న పిల్లలను ఇంటికి పిలిచాడు. వారంతా ఇంట్లోకి రాగానే గన్‌తో బెదిరించి బంధించాడు. వారిని విడిపించడానికి ప్రయత్నించిన గ్రామస్తులపై కాల్పులు జరిపాడు. దాంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులపైకి కూడా కాల్పులు జరపడంతో.. పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో పోలీస్ తూటాలకు సుభాష్ బాథమ్‌ మరణించాడు. శుక్రవారం రాత్రి 1:30 గంటలకు బాథమ్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలను బంధించాడన్న కోపంతో గ్రామస్తులు బాథమ్ భార్యపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాథమ్ భార్యను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన పోలీసుల బృందానికి సీఎం యోగీ ఆదిత్యానాథ్ రూ. 10 లక్షల అవార్డు ప్రకటించారు.

For More News..

తల్లిదండ్రుల్ని, తమ్మున్ని చంపిన మైనర్ బాలుడు

మనం బతికేది 38 ఏళ్లేనట!

వీడియో: భారత్, న్యూజిలాండ్ మూడో T20లో విచిత్ర సంఘటన