
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సైకో వీరంగం సృష్టించాడు. అమ్మవారి దర్శనానికి వచ్చి ఉప గర్భగుడిలో తన చేతిని కోసుకున్నాడు. రెండేళ్ల క్రితం గుడిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలయ సిబ్బంది సైకొను పట్టుకొని బాసర పోలీసులకు అప్పగించారు. సైకోను నిజామాబాద్ జిల్లా ప్రసాద్ గౌడ్ గా గుర్తించారు. ప్రసాద్ గౌడ్ తరుచు అమ్మవారి ఆలయంలో ఆత్మహత్య యత్నం చేస్తుండటం ఆలయ సెక్యూరిటీ వైఫల్యమేనని గ్రామస్తులు మండిపడుతున్నారు.