
హైదరాబాద్, వెలుగు : ఇండియాలో ఈ–స్పోర్ట్స్ మార్కెట్ చాలా బాగుందని లీడింగ్ వీడియో గేమ్స్ కంపెనీ పోల్ టూ విన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(పీటీడబ్ల్యూ) అమెరికా, ఇండియా ప్రెసిడెంట్ కస్తూరి రంగన్ అన్నారు. టాప్ టైర్ ఈ–స్పోర్ట్స్ టీమ్ ఆరెంజ్ రాక్ ను బుధవారం మార్కెట్‌కి పరిచయం చేశారు. ఈ టీమ్ ఇండియాలోనే టాప్ 3 టీమ్స్‌లో ఒకరు. వీరు మిలాన్‌లో జరుగబోతున్న ఈఎస్‌ఎల్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించినట్టు పీటీడబ్ల్యూ ప్రకటించింది. ఇండియన్ గేమర్స్‌ను గ్లోబల్‌గా తీసుకెళ్లేందుకు పీటీడబ్ల్యూ కృషి చేస్తున్నట్టు కస్తూరి రంగన్ తెలిపారు. ఆరెంజ్ రాక్ టీమ్‌తో పాటు మరిన్ని టీమ్‌లపై తాము ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ–స్పోర్ట్స్ అనేది ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్. వీడియో గేమ్స్‌లో ఇదీ ఒక భాగం. దీని మెజార్టీ యూజర్లు 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వారే ఉంటారు. 2021 నాటికి ఈ–స్పోర్ట్స్ కు 55.7 కోట్ల మంది యూజర్లు ఉంటారని అంచనావేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ–స్పోర్ట్స్‌లోకి ఎంటర్ కావడం ఇదే మొదటిసారని, ఈ గేమింగ్ రంగంలో ఇండియా ఇతర దేశాలను అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీటీడబ్ల్యూకి హైదరాబాద్‌లో, బెంగళూరులో ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే తమ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు పీటీడబ్ల్యూ చెప్పింది. ప్రస్తుతం పరిచయం చేసిన ఆరెంజ్ రాక్ టీమ్‌లో నలుగురు గేమర్లు ఉన్నారు. వారు మహి(హర్మందీప్ సింగ్, పంజాబ్), క్యారీ(గోపాల్ సర్తా, సూరత్), సంధు(హర్షిమీట్ సంధు, పంజాబ్), ఎగ్జిస్టెన్స్(చిసిన్, నాగాలాండ్)లు. కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన రిబ్బి(భరత్ కుమార్ రెడ్డి) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.