IPO News: నష్టాల మార్కెట్లోనూ అదరగొట్టిన ఐపీవో.. అడుగుపెట్టగానే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్..!

IPO News: నష్టాల మార్కెట్లోనూ అదరగొట్టిన ఐపీవో.. అడుగుపెట్టగానే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్..!

Flysbs Aviation IPO: ఇటీవల ఐపీవోల మార్కెట్ మంచి ప్రీమియం లిస్టింగ్స్ చూస్తోంది. తొన్ని ఐపీవోలు ఏకంగా రూపాయి పెట్టుబడికి రూపాయి లాభాన్ని అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఒక ఐపీవో మాత్రం 100 శాతం లిస్టింగ్ గెయిన్స్ అందించి అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్లైఎస్‌బీఎస్ ఏవియేషన్ కంపెనీ ఐపీవో గురించే. దేశీయ మార్కెట్లు పతనంలో ఉన్న సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి 90 శాతం లాభంతో ఒక్కోటి రూ.427.50 వద్ద జాబితా అయ్యాయి. లిస్టింగ్ తర్వాత కూడా కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్లతో అప్పర్ సర్క్యూట్ తాకింది. వాస్తవానికి కంపెనీ తన షేర్లను రూ.225 గరిష్ఠ రేటు వద్ద ఇష్యూ చేయగా నేడు 99.49 శాతం లాభాన్ని అందించింది. 

Also Read : శ్రావణ శుక్రవారం భారీగా పెరిగిన గోల్డ్

ఐపీవో మూడు రోజుల కాలంలో 318 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ చేయబడింది. ప్రధానంగా ఐపీవోకు నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ కనిపించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లను తొలిరోజే లాభాలతో ముంచేసింది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఐపీవో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 వరకు అందుబాటులో ఉంచబడింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ మార్కెట్ల నుంచి విజయవంతంగా రూ.102.53 కోట్లను సమీకరించింది. 

కంపెనీ వ్యాపారం..
2020లో స్థాపించబడిన కంపెనీ ప్రైవేట్ జెట్ సేవలను ఆఫర్ చేస్తోంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ దేశంలో అల్ట్రా లగ్జరీ, లార్జ్ లగ్జరీ, సూపర్ లగ్జరీ, హై స్పీడ్ జెట్ విమాన సేవలను ఆఫర్ చేస్తోంది. సంస్థ ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని వ్యాపార విస్తరణకు, కొంత రుణ చెల్లింపులకు వినియోగించాలని నిర్ణయించింది.