
EMI Lifes: ఆధునిక భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి ఈఎంఐలు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా లేదా ట్రావెల్ ప్లాన్ చేయాలన్నా ప్రతి దానికీ కావాలి ఒక ఈఎంఐ. వందల ఏళ్ల నాడు మన పూర్వీకులు నేర్పించిన ఆర్థిక సూత్రాలు ప్రస్తుతం ప్రజలు మర్చిపోయారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు డబ్బులు దాచుకోవటం కంటే లగ్జరీ జీవితం రుచిచూసేందుకు రుణాలపైనే గడిపేస్తున్నారు. దీనిని చూస్తుంటే అప్పు చేసైనా నిప్పులాంటి సారా తాగాలి అనే సామెత గుర్తుకురాక మానదు.
తాజా డేటా ప్రకారం సగటు భారతీయుల ఖర్చుల దోరణిని పరిశీలిస్తే ఎక్కువగా సంపాదనలో ఈఎంఐ చెల్లింపులకు పోతున్నట్లు తెలింది. దేశంలో 70 శాతం మంది ఫోన్లను ఈఎంఐలపైనే కొంటున్నారని తేలింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత కనీసం రూ.10వేలు విలువైన ఫోన్ కొనాలన్నా ఈఎంఐ దిక్కుగా మారిపోయింది. పైగా ఒక్కో ఇంట్లో ఎంత మంది మనుషులు ఉంటే అన్ని ఫోన్లు ఉండటం కూడా ఈ కల్చర్ పెరగటానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
ఇక సెంకడ్ కేటగిరీలో ఎక్కువగా కార్లను ప్రజలు రుణాలపై కొంటున్నట్లు తేలింది. రోడ్లపై తిరుగుతున్న కార్లలో దాదాపు 80 శాతం ఈఎంఐలపై కొన్నవేనట. అంటే కారు కొనటానికి కనీసం ఒక రూ.10 లక్షలు అయ్యాయి అనుకుంటే ప్రజల వద్ద ఆ మాత్రం సేవింగ్స్ కూడా ఉండటం లేదని ఇది తేటతెల్లం చేసింది.
Also Read : నష్టాల మార్కెట్లోనూ అదరగొట్టిన ఐపీవో.. అడుగుపెట్టగానే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్
చివరిగా భారతీయులకు మోస్ట్ సెంటిమెంటల్ ఎమోషనల్ అయిన సొంతింటి కల. రోజురోజుకూ రియల్టీ బూమ్ పెరిగిపోవటం అక్కర్లేకపోయినా ప్రజలు స్థలాలు, పొలాలు, లగ్జరీ ఇళ్లను ఒకటికి రెండు కొంటూ పోవటం కనిపిస్తోంది. అయితే ఈ ధోరణి మధ్యతరగతి భారతీయుల బడ్జెట్ కి అందని స్థాయిలకు ఇళ్ల రేట్లను చేర్చింది. దీంతో చాలా మంది తమ సొంతింటి కలను నెరవేర్చుకోవటం కోసం రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలోని 60 శాతం ప్రజలు హోం లోన్ ఈఎంఐ చెల్లింపుల చక్రంలో ఇరుక్కున్నట్లు డేటా చెబుతోంది. వీటికి తోడు ప్రస్తుతం కాలంలో ఆసుపత్రి బిల్లులకు, పిల్లల చదువుకులకు, గోల్డ్ కొనాలన్నా ఆఖరికి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ప్రజలు రుణాలను తీసుకుని వాటికి జీవితాంతం ఈఎంఐలు చెల్లించుకుంటూ హ్యాపీగా ఉన్నామనే భ్రమలో బతికేస్తున్నారు.