ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి
  • రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్​, వెలుగు: ప్రజలు అందించే వినతులపై తక్షణం స్పందించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్​లో ప్రజావాణిలో నిర్వహించగా, ఆయన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి.

వికారాబాద్​లో 56 అర్జీలు..

వికారాబాద్: వికారాబాద్​  కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 56 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించి పరిశీలించారు. 

హైడ్రాకు 48..

హైదరాబాద్ సిటీ: హైడ్రా కార్యాలయంలో గ్రీవెన్స్​కు 48 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ వాటిని పరిశీలించారు. లేఅవుట్లలో పార్కు స్థలాలు, వరద నీటి కాలువలు, శ్మశాన వాటికల కబ్జాలపై ఎక్కువగా కంప్లయింట్స్​ వచ్చాయి.