
డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ తెగకొంటున్నరు
గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి మస్తు పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు గోల్డ్‌ను ఆన్‌లైన్‌లో కొనడానికి లేదా పేపర్ గోల్డ్ (గోల్డ్ బాండ్స్)కే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ‘టోకెనైజ్డ్ గోల్డ్’లోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏదైనా సంక్షోభ సమయంలో ఇన్వెస్టర్లకు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం ఉంటోంది. కానీ ఫిజికల్ (భౌతిక) రూపంలో బార్లు, కాయిన్లు, జ్యూయల్లరీ కొనే దాని కంటే, ఇన్వెస్టర్లు పేపర్ లేదా డిజిటల్ రూపంలోనే గోల్డ్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పేపర్ లేదా డిజిటల్ రూపంలో కొనే గోల్డ్‌ను స్టోర్ చేసుకోవడంతోపాటు రిడీమ్ చేసుకోవడమూ చాలా ఈజీగా, సురక్షితంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. గ్లోబల్‌గా ఎకనమిక్ అనిశ్చితి ఉన్నప్పుడు.. ఈక్విటీ మార్కెట్ ఒడిదుడుకులు లోనయ్యే కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రిటర్న్‌లు పొందేందుకు గోల్డ్ వైపుకి చూస్తారు. దీంతో గోల్డ్‌కు ఈ కరోనా కాలంలో మస్తు డిమాండ్ పెరిగింది. గ్లోబల్‌గా గోల్డ్ ధరలు ఈ ఏడాది జనవరి నుంచి 31 శాతానికి పైగా పెరిగాయి. జనవరిలో రూ.39,200గా ఉన్న 10 గ్రాముల గోల్డ్ ధర, ప్రస్తుతం రూ.53 వేలను దాటింది.
లాక్‌డౌన్ నెలల్లో డిజిటల్ గోల్డ్, సిల్వర్ కొనుగోలు లావాదేవీలు 70 శాతం వరకు పెరిగినట్టు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ ఓరోప్యాకెట్ తెలిపింది. తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కు పెద్ద మొత్తంలో ఆసక్తి వచ్చినట్టు ఓరోప్యాకెట్ కోఫౌండర్ తరుషా మిట్టల్ అన్నారు. తమ డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్‌కు మంచి డిమాండ్ వచ్చినట్టు స్విట్జర్లాండ్‌కు చెందిన బులియన్ బ్రాండ్ పీఏఎంపీ, కేంద్ర ప్రభుత్వ ఎంఎంటీసీ వెంచర్ కూడా చెప్పింది. ప్రభుత్వం తీసుకొచ్చిన సావరీన్ గోల్డ్ బాండ్ ఇష్యూకు కూడా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి గిరాకీ వచ్చింది. డీమ్యాట్ అకౌంట్లు లేని ఇన్వెస్టర్లు, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ర్యాలీ పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్‌కు సంబంధించినదే ఉందని విశ్లేషకులు చెప్పారు. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి. ఫండ్ మేనేజర్లు ఎక్కువగా ఈ మెటల్‌ను కొంటున్నారు. గోల్డ్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్ల వైపుకే ఇన్వెస్టర్లు చూస్తున్నారు.
గోల్డ్ కొనుగోలులో కొత్త ఇన్‌స్ట్రుమెంట్లు ..
ఎంఎంటీసీ–పీఏఎంపీ గోల్డ్ అక్యుమ్యులేషన్ ప్లాన్, స్టోరేజ్, బైబ్యాక్ ఆప్షన్స్ ఆఫర్
ఎంఎంటీసీ–పీఏఎంపీ డిజిటల్ గోల్డ్ స్కీమ్, చిన్న మొత్తాల్లో కొనుగోలు చేసేలా కస్టమర్లకు ఆఫర్
వెల్త్ మేనేజ్‌మెంట్ అవుట్ ఫిట్స్ జారీ చేసే గోల్డ్ బ్యాక్డ్ డెట్ పేపర్స్
ఇంటర్నేషనల్ అసెట్ మేనేజర్లు జారీ చేసే గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌లు
ఓరోప్యాకెట్ గోల్డ్ టోకెన్స్.. రూ.1కి కూడా గోల్డ్ యూనిట్లు కొనుక్కోవచ్చు
For More News..