తాగు నీటి సమస్య లేదన్నరు..  నీటి కోసం రోడెక్కుతున్నరు 

తాగు నీటి సమస్య లేదన్నరు..  నీటి కోసం రోడెక్కుతున్నరు 

మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా నీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి పలు ప్రాంతాల్లో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలు నీటి కోసం అల్లాడుతున్నాయి.  జిల్లాలోని చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో మిషన్​ భగీరథ నీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే గోదావరి ఉన్నా ప్రభుత్వం తాగు నీరు అందించట్లేదని అంటున్నారు.  

ఈ క్రమంలో అధికారులకు తమ సమస్య చెప్పుకున్నా.. ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. చేసేదేమీ లేక జూన్​ 24న ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ గ్రామానికి నీరందించాలని డిమాండ్​చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఆర్వో భరణి బాబు గ్రామస్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన విరమించేది లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.