పుదుచ్చేరి మాజీ సీఎం కన్నుమూత

పుదుచ్చేరి మాజీ సీఎం కన్నుమూత

డీఎంకే నాయకులు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్వీ జానకిరామ్ (78) కన్నుమూశారు. కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం పొద్దున తుదిశ్వాస విడిచారు. రామన్.. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికయ్యారు.  1996 -2000 మధ్య కాలంలో సీఎంగా చేశారు. 2006లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వీరు డీఎంకే కన్వినర్ గానూ పనిచేశారు. 2011 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జానకి రామన్ మృతికి పలువురు రాజకీయనాయకులు సంతాపం తెలిపారు.