ఈ నెల 17 నుంచి పుల్లూరు బండ జాతర : సర్పంచ్ కుంచం లతా వెంకట్

ఈ నెల 17 నుంచి పుల్లూరు బండ జాతర : సర్పంచ్ కుంచం లతా వెంకట్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఈ నెల 17 నుంచి 21 వరకు పుల్లూరు బండ జాతర నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్లూరి కనకయ్య, సర్పంచ్ కుంచం లతా వెంకట్ తెలిపారు. శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అర్చకుడు చిలకమర్రి వెంకట ఫణి కుమారాచార్యులుతో కలిసి జాతర ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ..17న పుల్లూరు గ్రామంలోని హై స్కూల్ నుంచి రథయాత్రతో జాతర ఉత్సవాలను ప్రారంభిస్తామని 18న పవిత్ర స్నానాలు, విష్ణు సహస్రనామ పారాయణం, 19న గోపాల కాలువలు, 20న లక్ష్మీనరసింహస్వామి కల్యాణాన్ని నిర్వహించి 21న చక్రతీర్థముతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. 

ఉత్సవాలకు జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి,  జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. అనంతరం బండపై మరుగుదొడ్ల నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్, ఉత్సవ కమిటీ డైరెక్టర్లు దేవి రెడ్డి, యాదయ్య, రవి, రాములు, కిష్టయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.