పుల్వామా ఎటాక్: బాంబు తయారీకి కావలసిన వస్తువులు అమెజాన్‌లో కొన్న నిందితులు

పుల్వామా ఎటాక్: బాంబు తయారీకి కావలసిన వస్తువులు అమెజాన్‌లో కొన్న నిందితులు

పుల్వామా దాడి కోసం ఉపయోగించిన బాంబును తయారుచేయడానికి కావలసిని వస్తువులను ఆన్‌లైన్ సంస్థ అమెజాన్‌లో కొన్నట్లు నిందితులలో ఒకరైన వైజ్-ఉల్-ఇస్లాం తెలిపాడని ఎన్ఐఎ అధికారులు తెలిపారు. గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌.. పుల్వామాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) యొక్క కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందారు.

శ్రీనగర్‌కు చెందిన వైజ్-ఉల్-ఇస్లాం, పుల్వామాకు చెందిన మహ్మద్ అబ్బాస్ రాథర్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరి అరెస్టుతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. వీరిద్దరు తమ అమెజాన్ అకౌంట్ నుంచి ఐఇడి తయారీకి కావలసిన రసాయనాలను కొనుగోలు చేశారు.

పాకిస్తాన్ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఐఇడిలు, బ్యాటరీలు మరియు ఇతర వస్తువులను తయారు చేయడానికి కావలసిన రసాయనాలను తన అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ఖాతాను ఉపయోగించి కొన్నట్లు నిందితుడు ఇస్లాం చెప్పాడని ఎన్ఐఎ అధికారి ఒకరు తెలిపారు.

ఇస్లాం మరియు రాథర్లను శనివారం జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

For More News..

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్‌

కేటీఆర్ నమస్తే.. హరీశ్ షేక్ హ్యాండ్..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’