అంత ఆనందం ఏంట్రా : ఆఫీస్ మానేస్తూ.. ఆఫీస్ ఎదుట తీన్మార్ పెట్టాడు

అంత ఆనందం ఏంట్రా : ఆఫీస్ మానేస్తూ.. ఆఫీస్ ఎదుట తీన్మార్ పెట్టాడు

ఉద్యోగం రావడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం..  ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవాలంటే ఈ రోజుల్లో కత్తిమీద సాము లాంటిది. కొంతమంది తట్టుకోలేక ఉద్యోగం వేరే ఉద్యోగం చూసుకుని ఈ ఉద్యోగాన్ని మానేస్తారు.  అయితే పూణెలో ఓ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి జాబ్ మానేసి .. ఆఫీసు ఎదుట ధోల్స్​ తో ఆడుకొని ఎంజాయి చేశాడు.  వివరాల్లోకి వెళ్తే... 

అనీష్ భగత్ అనే వ్యక్తి పూణె లో ఒక కంపెనీలో పనిచేసేవారు.  అయితే  ఒక రోజు ఆయన తన జాబ్​ మానేసి ఆఫీసు బయట తన యజమాని చూసే విధంగా ధోల్స్​ ఆడుతూ.. డ్యాన్స్​ చేస్తూ సంతోషాన్ని వ్యక్త పరిచాడు.  భగత్​ స్నేహితులతో ధోల్​ ప్లేయర్​లను ఏర్పాటు చేసి తాను ఉద్యోగం మానేయడానికి గల కారణాలను వివరించాడు.  విషపూరితమైన వాతావరణం నుంచి బయటపడినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.   ఇదే తన ఉద్యోగానికి చివరి రోజు అని.. తన సహోద్యోగులకు విచిత్రంగా తెలిపాడు.  భగత్​ ఇలా థోల్స్​ ఆడి.. తోటి ఉద్యోగులకు  ఈ విషయం తెలిపేటప్పుడు కంపెనీ యజమాని చూస్తూ అక్కడే నిలబడి ఉన్నారు. 

 పూణేకి చెందిన సేల్స్ అసోసియేట్ అనికేత్ పూర్తిగా భిన్నమైన పనిని చేసారు. అతను తన కార్యాలయం వెలుపల ఉన్న ధోల్ ప్లేయర్‌లను పిలిచి, అతని బాస్ మొత్తం దృశ్యాన్ని చూస్తున్నప్పుడు తన హృదయాన్ని కదిలించాడు. తన వేడుకకు సంబంధించిన వీడియోను అనీష్ భగత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. .తాను మూడేళ్లుగా ఈ  కంపెనీలో పనిచేస్తున్నానని...తన జీతం  పెరిగిందని.. అయినా .. బాస్ తనకు గౌరవం ఇవ్వలేదని తెలిపాడు. గౌరవం లేని చోట పనిచేస్తే విష పూరితమైన వాతావరణంలో పనిచేసినట్లేనని అన్నారు.  ఈ ఆఫీసులో చివరి రోజు కాబట్టి అతని స్నేహితులతో కలిసి కార్యాలయం వెలుపల భగత్​ నృత్యం చేశారు.  అతని బాస్​ అక్కడ ఉన్నవారిని నెట్టి వారిపై అరిచాడు.  

భగత్​ తన ఇన్​స్ట్రాగ్రాంలో వీడియోను పోస్టు చేస్తూ .. ఈ రోజుల్లో విషపూరితమైన సంస్కృతి చాలా ఉంది.. గౌరవం.. అర్హత లేకపోవడం కంపెనీల్లో సర్వ సాధారణంగా మారిందని ట్యాగ్​ లైన్ ఇచ్చారు.  అయితే ఈ వీడియోను ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి) ఒక మిలియన్​కంటే ఎక్కువ మంది చూశారు.  ఈ వీడియో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించి కామెంట్ చేస్తూ లైక్​ చేశారు. భగత్ చేసిన పని సంతృప్తి కలిగించిందని ఒకరు కామెంట్​ చేయగా.. మరొకరు  ఈ నృత్యం సంతృప్తి ఇచ్చిందని షేర్​ చేశారు.  మూడో వ్యక్తి  ఇప్పటి వరకు నేను చూసిన వారిలో అత్యంత సానుకూల.. ప్రోత్సాహకరమైన వ్యక్తి మీరు అని భగత్​ను ప్రశంసించారు. ఇక నాలుగో వ్యక్తి లవ్​ యూ బ్రో.. మీరు చేస్తున్న పని చాలా మంచిదంటూ కామెంట్​ చేశారు.