Pune Porsche Accident Case: బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్

Pune Porsche Accident Case: బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్

పుణే ఫోర్చే కారు ప్రమాద ఘటనలో ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడి బ్లడ్ శాంపిల్స్ మార్చినట్లు ఆరోపణలు రావడంతో సా సూన్ జనరల్ ఆస్పత్రి కి చెందిన డా. అజయ్ తవార్, డా. శ్రీహరి హాల్నోర్ లను బుధవారం (మే29) సస్పెండ్ చేశారు. ఈ కేసులో వీరితోపాటు మరో ఇద్దరు ఆస్పత్రి కి సిబ్బందిని సోమవారమే అరెస్ట్ చేశారు. వీరిపై నిందితుడి బ్లడ్ శాంపిల్స్ ను మార్చారని ఆరోపణలతో పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. 

సాసూన్ జనరల్ హాస్పిటల్‌లోని ఫోరెన్సిక్స్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవార్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హల్నోర్, ఆస్పత్రి మార్చురీ అసిస్టెంట్ అతున్ ఘట్‌కంబ్లే ముగ్గురు కలిసి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న ఈ కారు ప్రమాదంలో నిందితుడైన 17 ఏళ్ల యువకుడి బ్లడ్ శాంపిల్స్ మార్చారని ఆరోపించారు. 

ఈ ప్రమాదానికి కారణమైన యువకుడి తండ్రి బ్లడ్ శాంపిల్స్ ను మార్చడానికి డాక్టర్లకు రూ. 3లక్షలు ఇచ్చాడు. ఈ కేసులో డాక్టర్ హాల్నోర్ వద్ద రూ. 2.5లక్షలు, ఘట్ కాంబ్లే వద్ద రూ. 50వేలు మొత్తం రూ. 3లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Also read : SER రైల్వేలో 1202 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..

పూణేలోని ప్రముఖ బిల్డర్, నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సాసూన్ జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ తవారేకు రెండు గంటల్లో వాట్సాప్‌లో 14 సార్లు కాల్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ మార్చాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నిందితుడి బ్లడ్ శాంపిల్స్ ఎవరి నమూనాలను ఉపయోగించారో గుర్తించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.