కన్నడ పవర్ స్టార్‌‌కు హార్ట్ ఎటాక్

కన్నడ పవర్ స్టార్‌‌కు హార్ట్ ఎటాక్

ప్రముఖ కన్నడ హీరో, అభిమానులు మద్దుగా పవర్ స్టార్ అని పిలిచే పునీత్ రాజ్‌కుమార్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం పునీత్‌కు ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఓ డాక్టర్ల బృందం ఆయన హెల్త్ కండీషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 46 ఏళ్ల పునీత్‌ ఆరోగ్య పరిస్థితిపై విక్రమ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రంగనాథ్ నాయక్ స్పందించారు. పునీత్ హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉందన్నారు. ‘పునీత్‌కు బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు పునీత్ ఆరోగ్య పరిస్థితి బాలేదు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యం అందిస్తున్నాం’ అని రంగనాథ్ నాయక్ అన్నారు. కాగా, పునీత్‌ కుటుంబ సభ్యులను కర్ణాటక సీఎం బొమ్మై పరామర్శించారు. పునీత్‌ పరిస్థితిని తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు.  

మరిన్ని వార్తల కోసం: 

ఫేస్‎బుక్‎ పేరు మార్పు

ఇకపై ఢిల్లీ దాదాగిరి నడవదు: మమతా బెనర్జీ

బాధ్యత లేదా..? జీతం తీసుకుంటలేరా?