600 కిలోల పేలుడు పదార్థాలతో.. పురాతన వంతెన కూల్చివేత

600 కిలోల పేలుడు పదార్థాలతో.. పురాతన వంతెన కూల్చివేత

నోయిడాలో ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన తరహాలోనే పుణె నగరంలోని ఓ వంతెనను మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న చాందిని చౌక్ లో శిథిలావస్థకు చేరుకున్న పురాతన వంతెనను కూల్చేశారు. ఇందుకోసం 600 కిలోల పేలుడు పదార్ధాలను ఉపయోగించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ వంతెనను పేలుడు పదార్థాలతో కూల్చారు. 

ఆ తర్వాత జేసీబీల సాయంతో వ్యర్థాలు తొలగించారు. అయితే  వంతెనలో కొంత భాగం ఇంకా కూలిపోలేదు.. ఇనుము ఎక్కువగా ఉండటం వల్లే వంతెనలోని కొంతభాగం కూలిపోలేదని అధికారులు తెలిపారు. నిర్ణీత సమయానికి కూల్చివేసి.. ఆ మార్గం మీదుగా ట్రాఫిక్ ను అధికారులు పునరుద్ధరించారు.  వంతెనను కూల్చేందుకు  దానిపై దాదాపు 1350 రంధ్రాలు చేసి..వాటిలో పేలుడు పదార్ధాలు పెట్టారు. కూల్చివేత సమయంలో వంతెన చుట్టూ 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు.