పంజాబ్ & సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మే 21న ప్రారంభమై జూన్ 6న ముగుస్తుంది.
పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 635. తెలంగాణలో 20 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తయి ఐదేళ్లు దాటకూడదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు కాదు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న వ్యక్తులు అర్హులు కాదు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: మే 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.200.
లాస్ట్ డేట్: జూన్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: 10+2 మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ punjabandsind.bank.inను సందర్శించండి.
