300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం

 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం

పంజాబ్లో అధికారాన్ని సొంతం చేసుకున్న ఆప్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటోంది. పంజాబ్లో నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల మేర విద్యుత్ను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో ఆప్ ప్రకటించింది. ఈ హామీని ఆప్ ప్రభుత్వం నిలబెట్టుకుంది.  300 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ తెలిపారు. 

 మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పంజాబ్ ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చాం. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు.

అంతేకాదు ప్రతి బిల్లుపై 600 యూనిట్ల విద్యుత్‌ను మాఫీ చేయనున్నట్లు కూడా భగవంత్ తెలిపారు. చెప్పినట్టే చెశామని..ఎన్నికల్లో పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు.

అటు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇప్పటికే ఇంటింటికీ రేషన్ సరఫరా హామీని ఆప్ సర్కార్ అమలు చేస్తోంది. అలాగే 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.