కాశ్మీర్​ స్టూడెంట్లకు సీఎం విందు

కాశ్మీర్​ స్టూడెంట్లకు సీఎం విందు

చండీగఢ్: పంజాబ్​లోని యూనివర్సిటీల్లో చదువుతున్న 125 మంది కాశ్మీర్ స్టూడెంట్లకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విందు ఏర్పాటు చేశారు. కాశ్మీర్​లో కర్ఫ్యూ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బక్రీద్ పండుగకు ఇంటికి వెళ్లలేని వారికి ఆయన దావత్ ఇచ్చారు. ‘‘మీ భద్రతకు ఇక్కడ ఎలాంటి ఢోకా లేదు. మీ ఫ్యామిలీ స్థానాన్ని మేం రీప్లేస్ చేయలేం. కానీ మమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ మాదిరే భావిస్తారని ఆశిస్తున్నాం” అని స్టూడెంట్లను ఉద్దేశించి అమరీందర్ అన్నారు. ‘‘రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల నేను చాలా రోజుల నుంచి కాశ్మీర్​కు వెళ్లలేదు. కానీ కాశ్మీర్​లోయ నాకు సెకెండ్ హోమ్. ఈ పండుగ ఆనందాన్ని స్టూడెంట్లతో పంచుకోవాలన్నది నా కోరిక” అని వివరించారు. ‘‘కాశ్మీర్​లో త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మీ వాళ్లందరూ అక్కడ క్షేమంగానే ఉంటారు. త్వరలోనే కలుస్తారు” అని ఆయన భరోసా ఇచ్చారు. పంజాబ్​ను తాము కూడా సెకెండ్ హోమ్ గా భావిస్తామని, తమకు సేఫ్టీ ఉంటుందని భావిస్తామని స్టూడెంట్లు అన్నారు.