పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు

పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు

మాన్సా: పంజాబ్ సీఎం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు పంజాబీ సింగర్, మాన్సా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శుభ్దీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా ఎన్నికల నియామావళి ఉల్లంఘించడంతో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. శుక్రవారం సాయంత్రం 6గంటలతో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. అయినప్పటికీ మూసేవాలా తరఫున సీఎం చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో ఆప్ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా మాన్సా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 

ఆప్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫ్లైయింగ్ సర్వైలైన్స్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే  చన్నీ, శుభ్దీప్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. స్థానికులను విచారించిన అధికారులు ప్రచార గడువు ముగిసినప్పటికీ చన్నీ, శుభ్ దీప్లు క్యాంపెయిన్ చేశారని తేలింది. దీంతో పాటు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 400 మందితో ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు చరణ్ జీత్ చన్నీతో పాటు శుభ్ దీప్ పై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు బుక్ చేశారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత వేరొకరి నియోజకవర్గంలో ఉన్నందుకు చన్నీపై, 400మందికిపైగా కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారని శుభ్ దీప్ సింగ్ పై ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.  117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం ఎన్నిక జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

రాజకీయంగా టీఆర్ఎస్ ఎప్పుడో ఓడిపోయింది

రహదారుల నిర్మాణానికి  కేంద్రం భారీగా  నిధులిచ్చింది