రైతుల మీద పెట్టిన కేసులు రద్దు చేస్తం

రైతుల మీద పెట్టిన కేసులు రద్దు చేస్తం
  • పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ 

చండీగఢ్: వరిగడ్డి కాల్చినందుకు రైతుల మీద ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడి రైతులు చేసిన నిరసనలకు సంబంధించిన కేసులను కూడా మాఫీ చేస్తామని సీఎం చరణ్ జిత్ చన్నీ బుధవారం చెప్పారు. ‘‘గడ్డి తగలబెట్టినందుకు ఇప్పటివరకు పెట్టిన కేసులన్నీ రద్దు చేస్తున్నాం. ఇకముందు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గడ్డిని కాల్చుడు ఆపాలని రైతులను విజ్ఞప్తి చేస్తున్నా” అని 32 రైతు సంఘాల నేతలతో భేటీ తర్వాత చన్నీ మీడియాతో అన్నారు. అయితే, వచ్చే ఏడాది పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున రైతులను ఆకట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.