స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్ సీఎం సోదరుడు

స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్ సీఎం సోదరుడు

చండీఘడ్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ పార్టీల్లో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు పార్టీలకు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించారు. 
మనోహర్ సింగ్ బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే ఒక కుటుంబం, ఒకే టికెట్ విధానాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ ఆ కారణంతో మనోహర్కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్కు కేటాయిస్తూ శనివారం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని నిర్ణయించారు. 2007లోనూ మనోహర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.