వైరల్ వీడియో: గుడ్లు దొంగతనం చేసిన హెడ్‌కానిస్టేబుల్

వైరల్ వీడియో: గుడ్లు దొంగతనం చేసిన హెడ్‌కానిస్టేబుల్

పంజాబ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దొంగల్ని పట్టుకొని.. దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసే దొంగతనం చేశాడు. అది కూడా ఒక చిల్లర దొంగతనం. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛండీఘర్‌‌కు చెందిన ప్రిత్‌పాల్ సింగ్‌ ఫతేగర్ సాహిబ్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఒకరోజు డ్యూటీలో భాగంగా ఎక్కడికో వెళ్లడం కోసం రోడ్డు మీద నిల్చున్నాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక కోడి గుడ్ల బండి నిలిపి ఉంది. కానీ, అక్కడ ఆ బండి యజమాని లేడు. దాంతో కానిస్టేబుల్ తన చేతికి పనిచెప్పాడు. అటూ ఇటూ చూస్తూ.. ఒక్కో గుడ్డు తీసి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఇదంతా ఎవరూ చూడట్లేదని అనుకున్నాడు. కానీ.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్ అయి.. పోలీసులు దృష్టిలో పడింది. దాంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రీత్‌పాల్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. ఆయన మీద డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలుపుతూ పంజాబ్ పోలీసులు ఒక ట్వీట్ చేశారు.