
సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించినా పరిస్థితి మారడం లేదు. స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం రావడం లేదు. పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో తమ పంటలను తగలబెడుతూనే ఉన్నారు రైతులు. బర్వాలాలో రైతులు తమ పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టారు. దీంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.
శివారు ప్రాంత రైతులు పంటలను కాలుస్తుండటంతో ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ లెవల్ కు చేరింది. ఢిల్లీ కాలుష్యంపై విచారించిన సుప్రీంకోర్టు.. తీవ్రంగా స్పందించింది. పంటల వ్యర్థాలను రైతులు తగలబెట్టకుండా ఆపడంలో రాష్ట్రాలు దారుణంగా విఫలమయ్యాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ మండిపడింది. రూల్స్ ని ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదని హెచ్చరించింది. అయితే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. తమ పంట వ్యర్ధాలను తగలబెట్టారు పంజాబ్ రైతులు. అయితే తమకు వేరే ప్రత్యామ్నాయం లేకు కాబట్టే పంటలను కాల్చుతున్నామని రైతులు చెబుతున్నారు.
Punjab: Farmers continue to burn stubble in Barwala village at Phillaur-Nakodar Highway in Jalandhar. pic.twitter.com/WST0qvonoX
— ANI (@ANI) November 10, 2019