పాకిస్తాన్కు గూఢచర్యం..సైనిక సమాచారం లీక్ చేస్తున్నారు..పంజాబ్లో ఇద్దరు అరెస్ట్

పాకిస్తాన్కు గూఢచర్యం..సైనిక సమాచారం లీక్ చేస్తున్నారు..పంజాబ్లో ఇద్దరు అరెస్ట్

ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలు,  భద్రతాదళాల కదలికల సమాచారాన్ని లీక్ చేశారని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పంజాబ్ పోలీసులు.గురుదాస్ పూర్ లోని సైనిక సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తో షేర్ చేసుకున్నారని ఆరోపించారు. పంజాబ్ కు చెందిన సుఖ్ ప్రీత్ సింగ్, కరణ్ బీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లోని భద్రతాదళాల కదలికలు, కీలక వ్యూహాత్మకప్రదేశాల వివరాలను పాకిస్తాన్ తో పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

గురువారం (మే16) కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ పోన్ల ఫోరెన్సిక్ పరీక్షలో అదే తేలిందని చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు,8 లైవ్ కార్ట్రిడ్జ్ స్వాధీనం చేసుకున్నారు. 

ALSO READ | పాక్ స్పైగా యూపీ వ్యాపారి.. అరెస్టు చేసిన ఎస్టీఎఫ్

నిందితులు ISI ఏజెంట్లతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు.. భారత్ సాయుధ దళాల కీలక సమాచారాన్ని షేర్ చేస్తున్నారని ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఇద్దరిపై దొరంగల పిఎస్ లో అధికారిక రహస్యాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది,దర్యాప్తు ముమ్మరం చేసే కొద్దీ మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.