IPL 2025: శ్రేయాస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. మ్యాచ్ జరుగుతున్నప్పుడే పంజాబ్‌కు పనిష్మెంట్

IPL 2025: శ్రేయాస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. మ్యాచ్ జరుగుతున్నప్పుడే పంజాబ్‌కు పనిష్మెంట్

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పై జరిమానా విధించబడింది. చెపాక్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 30) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్ కు రూ.12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న ఆరో కెప్టెన్ గా నిలిచాడు. అంతకముందు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభమాన్ గిల్, అక్షర్ పటేల్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నారు. 

శ్రేయాస్ నిర్ణీత సమయం లోపు ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేకపోయాడు. చెన్నై బ్యాటింగ్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో రెండో ఇన్నింగ్స్ దాదాపు 2 గంటల పాటు జరిగింది. పంజాబ్ బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ పాలక మండలి కొన్ని మార్పులు చేసింది. స్లో ఓవర్ రేట్ వేసిన కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా చాహల్ 19 ఓవర్ ప్రారంభించే ముందు  సర్కిల్ లోపల అదనపు ఫీల్డర్‌ను ఉంచమని అంపైర్ కోరారు.

Also Read :  నన్ను సర్జరీకి లండన్‌కు పంపింది

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఛేజింగ్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 72:5 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రభ్‌సిమ్రాన్‌ (36 బంతుల్లో 54:5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి గెలిచింది.