IPL 2025: పాక్ లీగ్ వదిలి మన దగ్గరకి: మ్యాక్స్ వెల్ స్థానంలో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు

IPL 2025: పాక్ లీగ్ వదిలి మన దగ్గరకి: మ్యాక్స్ వెల్ స్థానంలో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు

ఐపీఎల్ 2025 సీజన్ లో గాయపడిన గ్లెన్ మ్యాక్స్ వెల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ రీప్లేస్ మెంట్ ప్రకటించింది. మిగిలిన మ్యాచ్‌లకు  మ్యాక్స్ వెల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ ఓవెన్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ప్రకటనను ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ తరపున ఆడుతున్న ఓవెన్ రూ. 3 కోట్లకు పీబీకేఎస్‌లో చేరనున్నాడు. ఐపీఎల్ లో అవకాశం రావడంతో ఓవెన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ వదిలేసుకోనున్నాడు. 

" చేతి వేలి గాయం కారణంగా ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్‌లకు గ్లెన్ మాక్స్‌వెల్ దూరంగా ఉండటంతో, అతనికి బదులుగా పంజాబ్ కింగ్స్ (PBKS).. ఆల్ రౌండర్ మిచ్ ఓవెన్‌ను ఎంపిక చేసింది" అని IPL అధికారిక ప్రకటనలో తెలిపింది. మిచెల్ ఓవెన్‌ 2024-25లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. హోబర్ట్ హరికేన్స్ తరపున 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో ఓవెన్ కేవలం 42 బంతుల్లో 108 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. బిగ్ బాష్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 

Also Read : అంపైర్ ఔటిస్తే రెండు పరుగులు తిరుగుతారా

ఈ సీజన్ లో మ్యాక్స్ వెల్ దారుణమైన ఆటతో నిరాశరపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ లో ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. మెగా ఆక్షన్ లో పంజాబ్ అతన్ని నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే సాయి కిషోర్ ఫ్యాన్స్ రివర్స్ స్వీప్ ఆడి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఓవరాల్ గా 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది.