
చండీగఢ్: పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి తన తల్లి, కూతురు, పెంపుడు కుక్కును రివాల్వర్ తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా సూసైడ్ చేసున్నాడు. నిందితుడైన కుల్బీర్ మన్ సింగ్ రామ రాజ్య కాలనీలో నివసించేవాడు. తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ రివాల్వర్‌తో కూతురు నిమత్ర్ కౌర్ (21)ను మొదటగా అతడు కాల్చి చంపేశాడు.
ఆపై తన తల్లి బల్వంత్ కౌర్ (85), పెంపుడు కుక్కను కాల్చాడు. తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. కొంతకాలంగా కుల్బీర్ మన్ సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అతడి కూతురు నిమ్రత్ ఇటీవలే కెనడా నుంచి వచ్చిందని పోలీసు లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.