దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ)  దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆఫీస్ ఓపెన్ చేయాలని చూస్తోంది.   గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విస్తరించడంలో భాగంగా ఈ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరవడానికి బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. రెగ్యులేటరీ అప్రూవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చూస్తున్నామని  పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఎండీ అతుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ గోయల్ అన్నారు. రెగ్యులేటరీ అప్రూవల్స్ వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ రిప్రెజెంటేటివ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆరు దేశాల్లో పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  అందుబాటులో ఉన్నాయి. రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అగ్రికల్చరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ లోన్లను ఇవ్వడంపై ఫోకస్ పెట్టామని అతుల్ అన్నారు.