ముల్లన్‌పూర్: చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో నిలకడగా ఆడిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్–19లో బోణీ చేసింది. కూపర్ కనోలి (44 బాల్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 72 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 162/6 స్కోరు చేసింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (27 బాల్స్‌లో 6 ఫోర్లతో 39), జోస్ బట్లర్ (33 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ (3/34), యజ్వేంద్ర చహల్ (2/28) రాణించారు. తర్వాత పంజాబ్ 19.1 ఓవర్లలో 165/7 స్కోరు చేసి నెగ్గింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 37) మెరుగ్గా ఆడాడు. కనోలికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
వైశాక్, చహల్ అదుర్స్
బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై పంజాబ్ బౌలర్లు గుజరాత్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. సాయి సుదర్శన్ (13), గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చినా మిడిలార్డర్ తడబడింది. తొలి ఓవర్‌లో సుదర్శన్ ఫోర్‌తో ఖాతా తెరవగా, రెండో ఓవర్‌లో గిల్ మూడు బౌండ్రీలతో టచ్‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్‌లో చెరో ఫోర్‌తో స్కోరు 35/0కు చేరింది. 4వ ఓవర్‌లో యాన్సెన్ (1/20) తన నాలుగో బాల్‌కే సుదర్శన్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 37 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
వన్‌డౌన్‌లో బట్లర్ నిలకడగా ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జీటీ స్కోరు 54/1కి చేరింది. 7వ ఓవర్‌లో బట్లర్ సిక్స్ కొట్టినా, 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన చహల్ 10వ ఓవర్‌లో గిల్ వికెట్ తీశాడు. రెండో వికెట్‌కు 46 రన్స్ జత కాగా ఫస్ట్ టెన్‌లో గుజరాత్ 84/2 స్కోరు చేసింది. యాన్సెన్, బార్ట్‌లెట్ కూడా కట్టడి చేయడంతో జీటీ మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగింది. క్యాచ్ ఔట్ నుంచి బయటపడిన గ్లెన్ ఫిలిప్స్ (25) మధ్యలో 6, 4, బట్లర్ 6 బాదాడు.
రెండో స్పెల్‌కు దిగిన విజయ్ కుమార్ 14వ ఓవర్‌లో ఫిలిప్స్‌ను బోల్తా కొట్టించాడు. వాషింగ్టన్ సుందర్ (18) ఫోర్‌తో 15వ ఓవర్లలో స్కోరు 128/3గా మారింది. అయితే16వ ఓవర్‌లో చహల్.. బట్లర్ వికెట్ తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. సుందర్‌తో జతకలిసిన షారూక్ ఖాన్ (4) బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. 19వ ఓవర్లో విజయ్‌కుమార్ ఆరు బాల్స్ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్ చేశాడు. చివర్లో తెవాటియా (11 నాటౌట్), రషీద్ (0 నాటౌట్) హిట్టింగ్ చేయకపోవడంతో జీటీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
ఛేజింగ్‌లో పంజాబ్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7)ను రెండో ఓవర్‌లో రబాడ (1/34) వెనక్కి పంపాడు. తర్వాత ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి కనోలి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. 4, 6తో కనోలి, 6, 6తో ప్రభ్‌సిమ్రన్ జోరు పెంచారు. 5, 6వ ఓవర్లలో 4, 6, 4తో 18 రన్స్ వచ్చాయి. దాంతో పవర్‌ప్లేలో పంజాబ్ 55/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన ప్రభ్‌సిమ్రన్ రెండు భారీ సిక్స్‌లతో జోష్ పెంచాడు.
కానీ 10వ ఓవర్‌లో రషీద్ (1/29) అతన్ని ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 76 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. స్కోరు 86/2గా మారింది. 11వ ఓవర్‌లో వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన శ్రేయస్ అయ్యర్ (18)ను 13వ ఓవర్‌లో ప్రసిధ్ కృష్ణ (3/29) ఔట్ చేసి షాకిచ్చాడు. ఈ దశలో కనోలి నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో జీటీ బౌలర్లు షాకిచ్చారు.
14వ ఓవర్‌లో నేహల్ వదేరా (3) ఔట్ కాగా తర్వాతి ఓవర్‌లో ప్రసిధ్ నాలుగు బాల్స్ తేడాలో, శశాంక్ సింగ్ (4), స్టోయినిస్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దాంతో 35 రన్స్ తేడాతో నాలుగు వికెట్లు పడటంతో పంజాబ్ 118/6తో ఎదురీత మొదలుపెట్టింది. 15 ఓవర్లలో స్కోరు 121/6కు చేరింది. 34 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన కనోలి సిక్స్‌తో జోరు కొనసాగించాడు. యాన్సెన్ (9) ఓ సిక్స్ కొట్టి ఔటైనా, బార్ట్‌లెట్ (11 నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 162/6 (గిల్ 39, బట్లర్ 38, విజయ్‌కుమార్ 3/34, చహల్ 2/28).
పంజాబ్: 19.1 ఓవర్లలో 165/7 (కనోలి 72*, ప్రభ్‌సిమ్రన్ 37, ప్రసిధ్ 3/29).
