విజయ్ సేతుపతి లీడ్ రోల్లో పూరి జగ న్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'స్లమ్ డాగ్'. 33 టెంపుల్ రోడ్ అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్, ఛార్మీ,జె.బి. నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
Chennai, are you ready? 💥
— Puri Connects (@PuriConnects) June 6, 2026
Makkal Selvan @VijaySethuOffl is all set to welcome you into the world of #SlumDog - 33 Temple Road❤️🔥
Teaser Launch Event on 8th June at Hotel Green Park, Chennai from 5PM onwards🔥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥
Produced by… pic.twitter.com/j7T7aCDdBd
జూన్ 8న సాయంత్రం 6 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ టీజర్ పాన్ ఇండియావైడ్ గా రిలీజ్ అవుతుండ గా, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్ కోసం విజయ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీంతో టీజర్పై అంచనాలు పెరిగాయి.
విజయ్ సేతుపతికి జంటగా సంయుక్త నటిస్తున్న ఈ చిత్రంలో టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రాని కిసంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్గా విడుదల కానుంది.
Makkalselvan @VijaySethuOffl has completed dubbing for the teaser of #SlumDog - 33 Temple Road ❤️🔥
— Puri Connects (@PuriConnects) June 6, 2026
Adding his personal touch across languages, he has dubbed himself in Tamil, Telugu, and Hindi 🔥
TEASER out on JUNE 8th at 6 PM 💥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial… pic.twitter.com/5WSpQe56d4
