గాలిని ప్యూరిఫై చేస్తది

గాలిని ప్యూరిఫై చేస్తది

భవిష్యత్తులో కారు ట్రావెలింగ్ తీరే మారిపోబోతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. ఇక ముందు ముందు సెల్ఫ్ డ్రైవింగ్ ఈ–కార్లలో మరిన్ని అడ్వాన్స్డ్‌‌ ఫీచర్స్ రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వాడకంతో పొగ ఉండదు. పొల్యూషన్ సమస్య తీరుతది అన్న విషయాలు తెలిసిందే. అయితే లేటెస్ట్‌‌గా బ్రిటిష్ కంపెనీ డిజైన్ చేసిన కారు మరింత ఎకో ఫ్రెండ్లీ. అదెట్లనంటే.. ఈ కారు ప్రయాణించే దారిలో ఉండే పొల్యూటెడ్ ఎయిర్‌‌‌‌ను ప్యూరిఫై చేసి ఫ్రెష్ ఎయిర్‌‌‌‌ను రిలీజ్ చేస్తది. అందేకాదు సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు అయిన దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు మాదిరిగా మార్చేసుకోవచ్చు. దానిలోపల డైనింగ్ హాల్‌‌లా సెట్‌‌ చేసుకుని డిన్నర్ చేయొచ్చు. నిద్రొస్తే బెడ్రూమ్‌‌గా మార్చుకొని పడుకోవచ్చు. 
చైనా కార్ల కంపెనీ కోసం డిజైన్
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఐఎం మోటార్స్‌‌ కోసం లండన్‌‌లోని బ్రిటిష్ హిథర్‌‌‌‌విక్ స్టూడియో సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. అడ్వాన్స్డ్‌‌ సెల్ఫ్ డ్రైవింగ్ ఈ–కారును ‘ఎరో’ అనే పేరుతో రూపొందించింది. ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా దీనిని డిజైన్ చేయాలన్న ఆలోచనతో కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టామని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే రొటీన్ అయిపోయాయని, అందుకే మరింత అడ్వాన్స్‌‌మెంట్స్ దీనికి జోడించాలని అనుకున్నామని చెప్పింది. హై ఎఫీషియన్సీ పార్టికల్ ఎయిర్ (HEPA) ఫిల్టరింగ్ సిస్టమ్‌‌ను దీనికి అటాచ్ చేసేలా డిజైన్ చేశామని పేర్కొంది. ఎరో కారు ఎలక్ట్రికల్ వెహికల్ కావడంతో దీని నుంచి ఎటువంటి పొల్యూషన్ రాదు. అయితే దీనికి HEPA ఫిల్టరింగ్ సిస్టమ్ పెట్టడంతో రోడ్డుపై దీని చుట్టూ ఉండే ఇతర వెహికల్స్ రిలీజ్ చేసే పొల్యూషన్‌‌ను కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది. ఈ సిస్టమ్ పొల్యూట్ అయిన గాలిని తీసుకుని, దానిలో ఉండే దుమ్ము, హానికర రసాయనాలను ఫిల్టర్ చేసి, మంచి గాలిని బయటకు వదులుతుంది. కారు కింది భాగంలో సెట్ చేసే HEPA సిస్టమ్ ఫ్రంట్ పార్ట్‌‌ నుంచి గాలిని తీసుకుని, ఫిల్టర్ చేసిన వాటిని కింద ఒక మెష్‌‌లో ఉంచి, మంచి గాలిని వెనుక నుంచి రిలీజ్ చేస్తుందని హిథర్‌‌‌‌విక్ తెలిపింది. 
2023 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్
ఎరో కారును చైనా కంపెనీ 2023 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతోందని డిజైనింగ్ సంస్థ ఫౌండర్ థామస్ హిథర్ కుక్ తెలిపారు. చైనా ఐఎం మోటార్స్ కంపెనీ తమను అప్రోచ్ అయినప్పుడు రొటీన్ సెల్ఫ్​ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు కాకుండా కొత్తగా డిజైన్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం నుంచి ఈ డిజైన్ తీసుకొచ్చామని చెప్పారు. వ్యాక్యూమ్ మెషీన్‌‌లో వాడే టెక్నాలజీ ద్వారా HEPA  సిస్టమ్ గాలిని లాక్కునేలా డిజైన్ చేశామన్నారు. వేర్వేరు జిగ్‌‌జాగ్ ప్యాటర్న్‌‌లు, మెష్‌‌లు, ఫైబర్ మెటీరియల్స్ సాయంతో ఎయిర్‌‌‌‌ ఫిల్టరింగ్ ప్రాసెస్ జరుగుతుందని థామస్ తెలిపారు. అలాగే స్లీపింగ్ రూమ్, డైనింగ్ హాల్, గేమింగ్, హాయిగా కూర్చుని ట్రావెల్ టైమ్‌‌లో వర్క్ చేసుకోవాలన్నా వీలయ్యేలా ఇంటీరియర్ డిజైన్ చేసినట్లు చెప్పారు.