
ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్ పర్పుల్.కామ్ ప్రచారకర్తగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పర్పుల్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘బ్యూటీ ఫర్ ఆల్’ అనే లక్ష్యంతో గోపర్పుల్ క్యాంపెయిన్ రూపుదిద్దుకుందని పర్పుల్ పేర్కొంది. దాదాపు 6000 మేకప్ ఉత్పత్తులతో పాటు 5వేల నేచురల్ ఉత్పత్తుల వరకు అన్నీ రూ. 400 లోపే ఉంటాయని కంపెనీ ప్రకటించింది. పర్పుల్ బ్రాండ్‌కు మొదటి ప్రచారకర్తగా ఉండడం తనకెంతో ఆనందంగా ఉందంటూ సారా అలీఖాన్ ఈ సందర్భంగా తెలిపారు. మహిళలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా , సాధ్యమైనంత అందంగా వారు కనిపించేలా, భావించేలా ఈ ప్రోడక్ట్ చేస్తుందని ఆమె అన్నారు. పర్పుల్ తో ప్రయాణం తనకెంతో ఆనందని, పర్పుల్ ప్రచారకర్తగా ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు.