పుష్ప.. ఇరవై నాలుగు నెలల జర్నీ

పుష్ప.. ఇరవై నాలుగు నెలల జర్నీ

‘అల వైకుంఠపురంలో’ బంటుగా జాయ్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించిన అల్లు అర్జున్.. ‘పుష్ప’ కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ‘తగ్గేదే లే’ అంటూ తన శ్లాంగ్‌‌‌‌‌‌‌‌ని కూడా చేంజ్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ  17న రిలీజవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ ఇలా ముచ్చటించాడు. 

  • ఇరవై నాలుగు నెలల ప్రయాణం ఈ సినిమా. కోవిడ్ టైమ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే మైండ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లోనూ   టీమ్‌‌‌‌‌‌‌‌తో వీడియో కాల్స్‌‌‌‌‌‌‌‌ మాట్లాడేవాణ్ని. డైలాగ్స్ కూడా అప్పుడే ప్రాక్టీస్ చేశాను. ఇది ఎవరి లైఫ్ స్టోరీ కాదు.. పూర్తి ఫిక్షనల్‌‌‌‌‌‌‌‌.  రెడ్‌‌‌‌‌‌‌‌ శాండిల్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే పుష్పరాజ్ లైఫ్‌‌‌‌‌‌‌‌ జర్నీ. 
  • సుకుమార్ టీమ్ చాలా రీసెర్చ్ చేసింది. రాయలసీమ శ్లాంగ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడేవాళ్లతో పాటు రియల్ స్మగ్లర్స్ వీడియోస్ కూడా సేకరించారు. అవన్నీ చూసి చిత్తూరు యాస బాగా ప్రాక్టీస్ చేశాను. స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లో చెప్పిన డైలాగ్స్ సెట్‌‌‌‌‌‌‌‌లో ఉండవు. అప్పటికప్పుడు మార్చేస్తారు సుకుమార్. అందుకే డైలాగ్ పేపర్ లేకుండానే మాట్లాడేలా చిత్తూరు శ్లాంగ్‌‌‌‌‌‌‌‌పై పట్టు సాధించాను. 
  • కూలీ, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టర్, స్మగ్లర్ అని ఇందులో నావి మూడు గెటప్స్. క్యాస్ట్యూమ్స్ మొదలు మేకప్, హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్ వరకూ చాలా హోమ్ వర్క్ చేశాం.  ఇండియాలోనే బెస్ట్ మేకప్ టీమ్ అయిన ప్రీతి శీల్ సింగ్ టీమ్ ముంబై నుంచి వచ్చి మూడుసార్లు మేకప్ టెస్ట్ చేశారు. ఈ సినిమాకి ముందు స్పెషల్ మేకప్, ప్రాస్థటిక్ మేకప్ టెక్నిక్స్ లాంటివి నాకు తెలీదు. మేకప్ వేయడానికి రెండున్నర గంటలు పట్టేది. తీయడానికి అరగంట పట్టేది. 
  • ఇందులో నా క్యారెక్టర్ ఊర మాస్ కూడా కాదు.. నేల మాస్. ఇంతకు మించిన మాస్ క్యారెక్టర్ ఇక చేయలేను కూడా. ‘పుష్ప’ టైటిల్ చెప్పగానే వెంటనే నచ్చింది. అనౌన్స్ చేద్దామన్నాను కానీ అమ్మాయి పేరు కనుక అందరికీ నచ్చకపోవచ్చని, ఫస్ట్ లుక్, టైటిల్ ఒకేసారి విడుదల చేద్దామని అన్నారు సుకుమార్. 
  • చాలామందితో పనిచేస్తాం. కానీ కొందరే నచ్చుతారు. అలా నచ్చిన వాళ్లలో రష్మిక ఒకరు. భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ యాక్టర్ నటిస్తే బాగుంటుందని ఫహాద్‌‌‌‌‌‌‌‌ ఫాజిల్‌‌‌‌‌‌‌‌ని తీసుకున్నాం. స్పెషల్ సాంగ్స్ చేసేటప్పుడు హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ కొన్ని రిస్ట్రిక్షన్స్ చెబుతారు. కానీ ఏం అడిగినా కాదనకుండా మాపై నమ్మకంతో చేసిన సమంతకి థ్యాంక్స్. 
  • దీన్ని ప్యాన్ ఇండియా మూవీగా స్టార్ట్ చేయలేదు. తెలుగులో  చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. తమిళం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో దాక్కో దాక్కో మేక సాంగ్‌‌‌‌‌‌‌‌కి మంచి ఆదరణ దక్కింది. ఎలాగూ మలయాళంలో నా సినిమాలన్నీ డబ్ అవుతాయి కనుక ఇది కొత్తేమీ కాదు.
  • ఈ సినిమా తర్వాత నేను ఓ నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఆ తర్వాతే ఏం చేయాలా అనేది ఆలోచిస్తా.  రాజమౌళి గారితో వర్క్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఆయనతో పని చేయాలని ఏ హీరోకి మాత్రం ఉండదు! నాకూ ఉంది. అదే విషయం ఆయన్ని అడిగాను. తాను చేయాలనుకునే ప్రామిసింగ్ హీరోల్లో నేనూ ఉన్నానని, తప్పకుండా చేద్దామని అన్నారు. కచ్చితంగా ఏదో ఒకరోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని ఆశిస్తున్నాను. 

ఇంత పెద్ద కథను ఒకే పార్ట్‌‌‌‌‌‌‌‌లో చెప్పగలమా అనే అనుమానం మొదట్లోనే వచ్చింది. ట్రై చేద్దామని షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లో ఒకే పార్ట్‌‌‌‌‌‌‌‌ కష్టమని అర్థమైంది. ముందు పార్ట్ 1 రిలీజ్ చేసి, నెక్స్ట్ ఇయర్ పార్ట్ 2 రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకున్నాం. కానీ నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కంప్లీటవుతుందనుకుంటే ఆలస్యమైంది. దీంతో ప్రమోషన్‌‌‌‌‌‌‌‌కి టైమ్ తగ్గినా ప్రొడక్ట్ బాగా రావాలని పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాం.