‘పుష్ప’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు

‘పుష్ప’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు

ఓ సినిమా రిలీజయ్యాక.. సక్సెస్ టాక్ వచ్చాక.. దాని వైబ్రేషన్స్ కొన్ని రోజుల వరకు ఉంటాయి. కానీ ‘పుష్ప’ సినిమా తీరే వేరు. అతి తక్కువ సమయంలోనే వంద కోట్లు క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇన్ని వారాలు గడిచినా, ఓటీటీలో అందరికీ అందుబాటులో వచ్చేసినా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూనే ఉంది. రీసెంట్‌‌‌‌గా కొన్ని అరుదైన రికార్డులు సాధించింది ‘పుష్ప’. బాలీవుడ్‌‌‌‌లో సైతం వంద కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర భాషల్లో కూడా కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘బాహుబలి’ సినిమాల తర్వాత ఇతర భాషల్లో ఈ రేంజ్‌‌‌‌ హిట్టు కొట్టిన సినిమా ఇదేనంటున్నారు అనలిస్టులు. ఇక పాటలు కూడా వ్యూస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సమంత చేసిన ‘ఊ అంటావా’ సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్‌‌‌‌లో అత్యధికంగా చూసిన వీడియోల లిస్టులో ఫస్ట్ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. శ్రీవల్లి సాంగ్ అయితే తెలుగుతో పాటు హిందీలోనూ దూసుకుపోతోంది. అక్కడ వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఏ రేంజ్‌‌‌‌లో హిట్టయ్యిందో అర్థమవుతోంది. ఇక  బన్నీ ఫాలోయింగ్ కూడా అంతకంతకు పెరిగిపోతోంది. గతంలో పదిహేను మిలియన్ల మంది ఫాలోవర్లు ఉంటే.. ‘పుష్ప’ రిలీజయ్యాక పది రోజుల్లోనే మరో మిలియన్ మంది అభిమానులు యాడ్ అయ్యారట. చూస్తుంటే ‘పుష్ప’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ జోష్‌‌‌‌లో సెకెండ్ పార్ట్‌‌‌‌ మొదలు పెట్టడానికి టీమ్‌‌‌‌ రెడీ అయిపోతోంది.