
సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa The Rule ) సినిమాలో సాయిపల్లవి (Sai Pallavi) స్పెషల్ రోల్ లో నటిస్తోందని తెలుస్తోంది. ట్రైబల్ గర్ల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ రోల్ చేయడానికి పల్లవి పది రోజుల సమయం కేటాయించిందని సమాచారం. రీసెంట్గా సాయిపల్లవి శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గర్కి మూవీల్లో కనిపించింది. ఏప్రిల్ 7వ తేదీన పుష్ప ది రూల్లో వీడియో గ్లిమ్స్ వస్తాయని, ఆ రోజు అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డేనని తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుకు మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విశాఖ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం తెలిసిందే.